Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page

శంకర గ్రంథరత్నావళి

పిబన్తు వాఙ్మయసుధామ్‌ - తరన్తు భవసాగరమ్‌

శ్లో|| శ్రుతి స్మృతి పురాణానా మాలయం కరుణాలయం|

నమామి భవత్పాద శఙ్కరం లోక శఙ్కరమ్‌||

అద్వైత రసపిపాసువులకు అపూర్వావకాశము

శ్రీ శంకరాచార్యులు జగద్గురువులు. వారి మహత్త్వము సర్వజన విదితము. వారు రచించిన గ్రంథము లనేకములు. అవి యన్నియు కర్మ, భక్తి, జ్ఞాన ప్రబోధకములు. అవి రచింపబడి వేలయేండ్లు గడచినవి. అయినను వాని దీప్తి మాయలేదు. మాయదు. ఈ వాఙ్మయ సేవవలన మానవలోకము దీప్తిమంత మగును మానవజన్మ చరితార్ధమగును.

సంస్కృత భాషయందున్న ఈ గ్రంథములు మొత్తము 153. ఉపదేశ ప్రకరణ గ్రంథములు, 57, స్తవస్తోత్రములు 72, భాష్యములు 24.

ఈ శంకరవాఙ్మయము సంతను ''శంకరగ్రంథరత్నావళి'' అనుపేర ప్రత్యేక శాఖగా మా మండలిలో సుమారు 33 సంపుటములుగా తెలుగున అనువదించి మూలముతోఁ బ్రకటింపవలెనని సంకల్పించి ఇప్పటికి 15 సంపుటములు ప్రకటించితిమి. ఇది శ్రమ వ్యవ సాధ్యమైన కార్యము. అనువాద కార్యమునకై పండితులు శ్రమించినను ఉదారులు చేయూత యొసంగనిచో గ్రంథ ప్రకటనము దుస్సాధ్యమగును. జ్ఞానకర్మోపాసనా మార్గములకు వెలుగుబాటలైన యీ గ్రంథములను బ్రకటించుటయందు వితరణ చేయబడిన ధనము ఇతర ధర్మకార్యముల కంటె మిన్నయై సత్ఫలము నొసంగునను విషయము విజ్ఞులకు దెలియనిది కాదు. అందుచే మా యీ శంకర వాఙ్మయ ప్రచారమునకు విశేషము ఆర్ధిక సమాయము చేసి సహకరించమని కోరుచున్నాము.

సాధన గ్రంధ మండలి, తెనాలి-522 201.

Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page